పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 15
అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ మరియు కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిథిగా కాజీపేటలోని బన్ను ఆరోగ్యదా మానసిక దివ్యాంగుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించగా ఆ బతుకమ్మ సంబరాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు , పిల్లలు ఆశ్రమ సిబ్బంది బతుకమ్మలు పేర్చి ఆట పాటలతో అలరించారు, ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ మన తెలంగాణా పండుగ బతుకమ్మ అని ఈ పండుగ లో ప్రత్యేకత అందరి దేవుళ్లను పూలతో పూజిస్తే ఈ పండుగ ప్రత్యేకత పూలనే అమ్మవారిగా కొలవడం అని అన్నారు, మహిళలు తమ పసుపు కుంకుమలు కాపాడు తల్లి గా గౌరమ్మ ని కొలుస్తారని, ఇది ఏ దేశంలో లేని పండుగ అని, ఇది మన తెలంగాణా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం అని, అన్నారు, పండుగ అంటే పదిమందిని సంతోషపెట్టడం అన్నారు, మానసిక దివ్యాంగులకు ఆనందాన్ని పంచాలని ఈ కార్యక్రమం నిర్వహించామని పిల్లల ఆనందం, కోలాటం డాన్సులు, బతుకమ్మ పాటలు ఎంతో అలరించాయని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు , అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితారెడ్డి , మానస సంస్థ నిర్వహకులు కిరణ్ కుమారి, చంద్రజిత్ రెడ్డి,రాము, టీచర్స్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు..