-బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…..బతుకమ్మ సంబరాల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు….

వరంగల్ పరివర్తన  అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హాసన్‌పర్తి మండల కేంద్రంతో పాటు గుంటూరుపల్లి, వంగపహాడ్,56 వ డివిజన్ గోపాలపూర్ ,55వ డివిజన్ భీమారం, గుండ్లసింగారంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే బతుకమ్మ ఆడుతూ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక...