ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04 వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్లో ఆదివారం ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గోదాములో మంటలు ఎలా చెలరేగాయి, ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయాలను స్థానికులు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన...