Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:24 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలోని బాలాజీనగర్‌లో ఆదివారం ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గోదాములో మంటలు ఎలా చెలరేగాయి, ప్రమాదానికి గల కారణాలు ఏమిటనే విషయాలను స్థానికులు, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టం, పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయనే అంశాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి చేపట్టిన చర్యలను పరిశీలించి, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా స్క్రాప్ గోదాములు, పరిశ్రమల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ఇంతియాజ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మెన్ సిలువేరు శ్రీనివాస్, నాయకులు శంకర్, కుమార్, రవి, జవిడ్, రాజేష్, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.