-ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి అండగా నిలిచి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, ఆపన్నులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడికి ఆర్థిక సహాయం అందించి, మెరుగైన వైద్యం పొందేలా చొరవ తీసుకోవడంతో పాటు, కోలుకోని ఇంటికి చేరిన యువకుడిని స్వయంగా పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన మంద మల్లేశం – రాధిక దంపతుల కుమారుడు కార్తిక్...