Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 4:40 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-ప్రమాదకర శబ్ద పరికరాలు విక్రయిస్తే కఠిన చర్యలు –మట్టేవాడ సిఐ కరుణాకర్ రావ్…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రమాదకరమైన శబ్దాలు చేసే పీకలు, ఇతర శబ్ద పరికరాలను విక్రయించరాదని మట్వాడా పోలీస్ స్టేషన్ సిఐ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి పరికరాలను విక్రయించే వ్యాపారులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.చిన్నపిల్లలు, యువత ఇలాంటి ప్రమాదకర శబ్ద పరికరాలను ఉపయోగించకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శబ్ద కాలుష్యాన్ని నివారిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పండుగలను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు మట్టేవాడ సిఐ కరుణాకర్ రావు  విజ్ఞప్తి చేశారు.