–ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …–బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 ములుగు జిల్లా తాడ్వాయి–పస్రా జాతీయ రహదారిపై సెప్టెంబర్ 25వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పర్వతగిరి మండలం పెద్దతండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు నూనావత్ శక్రూ, కైకాలను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పరామర్శించారు.హనుమకొండలోని సంకీర్తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే స్వయంగా ఆసుపత్రికి వెళ్లి కలుసుకుని వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు....