–ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార కార్యక్రమం ప్రారంభం… –విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత — ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 హనుమకొండ జిల్లా హసన్పర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించే అల్పాహార కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చహత్ బాజ్పాయ్ తో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ... విద్యార్థులు ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాఠశాలలో చదువుపై మరింత ఏకాగ్రత సాధించగలుగుతారని తెలిపారు....