పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించే అల్పాహార కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి చహత్ బాజ్‌పాయ్ తో కలిసి ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్వయంగా అల్పాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ… విద్యార్థులు ఉదయం పూట పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాఠశాలలో చదువుపై మరింత ఏకాగ్రత సాధించగలుగుతారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసం, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాఠశాలలోనే ఉదయం పూట నాణ్యమైన అల్పాహారం అందించడం ద్వారా తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. హసన్‌పర్తి ప్రభుత్వ పాఠశాలను మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడానికి సుమారు 6కోట్లకు పైగా నిధులతో ప్రణాళిక రూపొందిస్తున్నామని అన్నారు.హరేకృష్ణ మూవ్ మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అల్పాహారం అందించడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ అధ్యక్షులు గోర్రె కిరణ్,మాజీ డివిజన్ అధ్యక్షులు కనుపర్తి కిరణ్,మండల అధ్యక్షులు అశోక్,మాజీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి,2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతి,మల్లారెడ్డిపల్లి పీఏసీఎస్ చైర్మన్ కుమారస్వామి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జోరుక పుల,ఉపాధ్యక్షురాలు స్వాతి,,కాంగ్రెస్ నాయకులు సురేందర్, నరసింహ, రాములు, వెంకన్న (ఎల్ఐసీ), వెంకటస్వామి, నన్నెపుశెట్టి స్వామి, విజయ్ (మాజీ సర్పంచ్), ప్రభాకర్, మదన్ గౌడ్, సంపత్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు.