–ప్రత్యేకంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి… –జీవో నెం. 48 ద్వారా 22.03.2025 తేదీ రోజున ప్రభుత్వం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు ఇచ్చింది….  –స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీని రాష్ట్రంలోనే మంచి పేరున్న విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య, ల్యాబొరేటరీలు, లైబ్రరీ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలాకాన్ని...