–ప్రతి పౌరుడు రెడ్‌క్రాస్‌ సభ్యత్వం తీసుకోవాలి… —-ప్రజాసేవలో రెడ్‌క్రాస్‌ మరింత ముందుండాలి…. —వరంగల్ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద….

పరివర్తన  అవాజ్ తెలుగు దినపత్రిక  వరంగల్‌, అక్టోబర్‌ 22 మానవతా విలువలకు, స్వచ్ఛంద సేవలకు ప్రతీకగా నిలుస్తున్న ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా సామాజిక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్య శారద సూచించారు. అవసరంలో ఉన్న పేదలు, నిరుపేదలు, బాధితులకు రెడ్‌క్రాస్‌ సభ్యులు సమన్వయంతో సేవలందించాలని పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా తొలి ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతి...