—ప్రజల సమస్యల పరిష్కారం లో అలసత్వం వీడండి : బల్దియా కమిషనర్ వెంకన్న…

-ప్రజావాణిలో 113 దరఖాస్తుల స్వీకరణ..... --GWMC పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక  అక్టోబర్ 26 ప్రజల సమస్యల పరిష్కారం లో అలసత్వాన్ని వీడాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదుల సంబంధ దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావానికి అనుగుణంగా సంబంధిత విభాగాలకు బదలాయించారు. గ్రీవెన్స్ దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదని అధికారులను...