-ప్రజల అభ్యున్నతి, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే నాయిని… —31 వ డివిజన్ లో రూ.2.60 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హనుమకొండ, అక్టోబర్ 3: పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక    వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన గడిచిన 33 నెలల్లో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.శనివారం 31వ డివిజన్ పరిధిలోని అవంతి స్కూల్ కాలనీ, హంటర్ రోడ్ విశాల్ మార్ట్ ఆవరణ, సూర్యోదయ కాలనీ, శ్రీరామ్ హిల్స్, హంటర్ హిల్స్...