—రంగాళీల మైదానంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు….బతుకమ్మ ఆటల్లో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ….
వరంగల్, అక్టోబర్ 18 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక
వరంగల్లోని రంగళీల మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ…. పూలనే దైవంగా భావించి పూజించే బతుకమ్మ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదని, మానవ జీవితానికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధానికి ప్రతీక అని అన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ బతుకమ్మ సంబరాలలో మాజీ మంత్రి తూర్పు నియోజక వర్గ ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ వెంట గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గోపాల్ నవీన్ రాజుకమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మెడిది మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సంయుక్త కోశాధికారి వెలిది శివమూర్తి, ఉత్సవ కన్వీనర్ వొడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారుఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.