పోలీసు సిబ్బంది సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తా: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16 పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు.వరంగల్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు కొండా కర్ణాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని సుబేదారి క్యాంపు కార్యాలయంలో కలిసి, పోలీసు సిబ్బందికి సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి రావాల్సిన పీఆర్సీ, డీఏలు,...