పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16
పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు హామీ ఇచ్చారు.వరంగల్ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు కొండా కర్ణాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ని సుబేదారి క్యాంపు కార్యాలయంలో కలిసి, పోలీసు సిబ్బందికి సంబంధించిన వివిధ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి రావాల్సిన పీఆర్సీ, డీఏలు, పెండింగ్ ఏరియర్స్, అడిషనల్ అలవెన్సులు, సరెండర్ లీవులకు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి విజ్ఞప్తి చేశారు.వినతిపత్రంపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ… పోలీసు సిబ్బంది సమస్యలు తనకు తెలుసని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ ఏరియర్స్, అడిషనల్ అలవెన్సులు, సరెండర్ లీవుల బకాయిల విడుదల అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని హామీ ఇచ్చారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేలా కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, వారి న్యాయమైన హక్కుల సాధనకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు కొండా కర్ణాకర్, నరేష్, మహేందర్ యాదవ్, ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.