–పైడిపల్లిలో స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.. –లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6 వర్ధన్నపేట నియోజకవర్గంలోని 3వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే  అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా...