Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 1:27 pm Posted by : Bommala Kumar

పేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ.. రూ.34 వేల చెక్కు అందజేత

అవాజ్ న్యూస్ | సెప్టెంబర్ 30 | ఆళ్లపల్లి

ఆళ్లపల్లి: ఆళ్లపల్లి మండల కేంద్రంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పెద్దవెంకటాపురం గ్రామానికి చెందిన తాటి సత్యం కుటుంబానికి సీఎం సహాయనిధి కింద రూ.34,000 విలువైన చెక్కును అందజేశారు.
ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ఆధ్వర్యంలో సత్యం గారికి ఈ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా వాసం శ్రీకాంత్ మాట్లాడుతూ.. పేద ప్రజలకు అవసరమైన సమయంలో సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రతి కుటుంబానికి అండగా నిలిచేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.