Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:05 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

—పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని దంపతులు…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 10

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి , వారి సతీమణి  నాయిని నీలిమా రెడ్డి  పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.తొలుత వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు, అనంతరం 54వ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని మహిళలను ఉత్సాహపరిచారు. తదనంతరం నయీంనగర్ నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.అనంతరం 30వ డివిజన్ పరిధిలోని బాలసముద్రం ఏకశిలా పార్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అందంగా,ఉత్తమంగా బతుకమ్మలను పేర్చిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  మాట్లాడుతూ,… బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. మహిళలు ఐకమత్యంతో, ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం సంతోషకరమన్నారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ వేడుకల్లో స్థానిక మహిళలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.