Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 4:38 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

పలు ప్రాంతాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారిని దర్శించుకుని, అన్నదానంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….

హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ 54వ డివిజన్ పరిధిలోని సగర కాలనీలో ‘ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపాన్ని ఆయన సందర్శించారు. అనంతరం, కాలనీ ప్రజలకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. యువత ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

–అక్కేంపేటలో అన్నదాన కార్యక్రమం… అనంతరం ఆత్మకూరు మండలం అక్కేంపేట గ్రామంలోని శివాలయం లో నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలకు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకున్న అనంతరం, భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. దుర్గాదేవి ఆశీస్సులతో జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ముడ్డం సాంబయ్య, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.