–పర్వతగిరిలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే KR నాగరాజు …

-పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం, గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను...