-పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02
పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం, గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు గాంధీజీ సిద్ధాంతాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన విగ్రహ దాత స్వయం ప్రకాష్ ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అభినందించారు. గాంధీజీపై ఉన్న అభిమానంతో ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ఉష దయాకర్, పర్వతగిరి మండల అధ్యక్షురాలు సావిత్రి, సర్పంచ్ శంకర్, కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి PACS చైర్మెన్ అత్తి కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బానోత్ సింగులాల్,పట్టణ మాజీ అధ్యక్షులు కుసం రామచందర్, ఏనుమాముల మార్కెట్ డాక్టర్ గొడుగు బిక్షపతి, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లు, మండల సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.