Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:57 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే కటిన చర్యలు – డాక్టర్ అనితా రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 14 

ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, వరంగల్ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారీలోని వారి కార్యాలయంలో పోష్ చట్టం -2013 పై అవగాహన కార్యక్రమం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోష్ కమిటీ కన్వీనర్ మెంబర్, టైనర్ మరియు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి PoSH (పోష్) చట్టం -2013 పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది , ఉద్యోగస్తులకి చట్టాల పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, పోష్ చట్టం పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ చట్టాల పై పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారని అన్నారు, పోష్ (POSH) చట్టం-2013 పై మాట్లాడుతూ పని ప్రదేశాలలో మహిళలు లైంగిక వేధింపులు, నిరాదరణ, నిషేధం మరియు పరిహర చట్టాన్ని పోష్ చట్టం అంటారని ఈ చట్టం పై అవగాహన కలిగి ఉంటే ఉద్యోగాలు చేసే ప్రదేశాలలో మహిళలు తమను తాము సమస్యలు వస్తే ఎలా రక్షించు కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా, ఎవరికి ఫిర్యాదు చేయాలి అని మహిళలు తెలుసుకుని అర్థం చేసుకుంటే ధైర్యంగా సమస్యలు ఎదుర్కొోగలుగుతారని అన్నారు, అందుకే ఈ కార్యక్రమం మహిళలకోసం ఇక్కడ నిర్వహించామని ఇది మహిళలకు మంచిగా ఉపయోగపడే కార్యక్రమం అన్నారు, పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు, ప్రతి సంస్థలు, ఆఫీసులు, స్కూల్స్, కళాశాలలు, మాల్స్ ఇలా ప్రతి సంస్థలలో పోష్ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీ మెంబర్స్ పేర్లు, సెల్ నెంబర్లలతో సహ వాటిని కార్యాలయాలలో అందరికి కనిపించే లా ఏర్పాటు చేయాలని అన్నారు అలాగే ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని,ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, వ్యవసాయం చేసే చోట,రైతులకు, కూలీలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని అన్నారు, ఈ చట్టం పై గ్రామ స్ధాయి నుండి కార్పొరేట్ స్థాయి వరకు అవగాహన అవసరం అని అన్ని డిపార్ట్మెంట్స్, స్వచ్ఛంద సంస్థలు కన్వర్జెన్సీ సమన్వయం తో కలిసి పనిచేస్తుా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, అనంతరం పోస్టర్లు ఆవిష్కరించారు, ఈ కార్యక్రమం లో డాక్టర్ అనితా రెడ్డి, ప్రజ్వల సంస్థ రాం మూర్తి, శ్రీనివాస్, రమేష్, , పోష్ కమిటీ సభ్యులు, మహిళలు సిబ్బంది పాల్గొన్నారు.