–పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో సహజ ఘట్టం.. సేవలే చిరస్మరణీయం– –బల్దియా ప్రత్యేకాధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్–

  పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక GWMC, సెప్టెంబర్ 30: ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమైన ఘట్టమని, అయితే ప్రజాసేవలో అందించిన అంకితభావంతో కూడిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తాయని బల్దియా ప్రత్యేకాధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు.బల్దియా ఇంజనీరింగ్ విభాగం ఈఈ సంతోష్ బాబు, డీఈ రంగారావు, ఆపరేటర్ రాజకోమురయ్య పదవీ విరమణ సందర్భంగా బల్దియా జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమానికి చాహత్ వాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు....