నియోజకవర్గంలోని ప్రతీ ఎకరానికి రెండు పంటలకు సాగు నీరు అందించాలన్నదే నా ఆలోచన…. -రాజకీయాలకు అతీతంగా దేవాదుల పనులకు ప్రతీ ఒక్కరూ సహకరించాలి….. – ఎమ్మెల్యే కడియం శ్రీహరి….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 30 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి గండి రామారం లిఫ్ట్-1 అత్యంత ప్రాముఖ్యమైనదని ఎట్టిపరిస్థితుల్లో జనవరి లో ప్రారంభించి రెండో పంటకు సాగు నీరు అందించాలని అధికారులను మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశించారు.చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులోని గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ -1 పంపు హౌస్ నిర్మాణ పనులను నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి క్షేత్రస్థాయిలో...