Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:34 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–నాయీబ్రాహ్మణుల ప్రతి షాపులో ఎమ్మెల్యే నాయిని చిత్రపటం.. –నాయీబ్రాహ్మణ సంఘానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు వినూత్న రీతిలో కృతజ్ఞతలు..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 6

హనుమకొండ: నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రతి సందర్భంలోనూ చేదోడువాదోడుగా నిలుస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి కి నాయీబ్రాహ్మణ సోదరులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు బలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నాయీబ్రాహ్మణ షాప్, సెలూన్‌లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సెలూన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన ఎమ్మెల్యే  చిత్రపటాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  చేతుల మీదుగా విడుదల చేశారు.నాయీబ్రాహ్మణుల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి సంక్షేమం కోసం నిరంతరం అండగా నిలుస్తున్న ఎమ్మెల్యేకు తమ కృతజ్ఞతను చాటుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయీబ్రాహ్మణ సోదరులు తెలిపారు.నాయీబ్రాహ్మణుల వృత్తి, సంక్షేమం, అభివృద్ధికి ఎమ్మెల్యే నాయిని అండగా నిలుస్తున్నారని, అందుకే ఆయన చిత్రపటాన్ని తమ వ్యాపార కేంద్రాల్లో ఏర్పాటు చేసుకుంటున్నామని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపెల్లి శ్రీనివాస్, నాగవెల్లి సురేష్ కుమార్,తూముల సాంబయ్య, కురిమిళ్ల రమేష్, నాగవెల్లి కృష్ణ, సూరయ్య, కోడెపాక రాజేందర్, నడిగోటి నవీన్,నాయీబ్రహ్మణ ఉద్యోగుల సంఘం నాయకులు జంపాల యుగేందర్, మొగిలిచర్ల జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.