Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:05 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే నాయిని..జ్యోతి ప్రజలన చేసి అధికారికంగా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని దంపతులు..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 11

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి , వారి సతీమణి  నాయిని నీలిమ రెడ్డి తో కలిసి శ్రీ భద్రకాళి దేవస్థానం, పద్మాక్షి ఆలయం, వేయి స్తంభాల దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.వేయి స్తంభాల దేవాలయంలో ప్రతి ఏటా స్వయంగా అమ్మవారిని ప్రతిష్ఠించి, నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ మంచి జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు.అనంతరం కుమార్ పల్లిలో ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకున్నారు.51 వ డివిజన్ పరిధిలోని BLN రెడ్డి కాలనీలో ప్రముఖ వైద్యనిపుణులు డాక్టర్ శ్రీరామ్ రెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.ఎమ్మెల్యే వెంట స్థానిక డివిజన్ నాయకులు,ఆలయ అర్చకులు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.