ధర్మారంలో వైభవంగా దేవి నవరాత్రి వేడుకలు: అమ్మవారి పల్లకి సేవలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18 ధర్మారం (పరకాల): పరకాల నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 16వ డివిజన్ ధర్మారంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ధర్మారంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపాలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పరకాల పీసీసీ సభ్యులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన...