హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 18
ధర్మారం (పరకాల): పరకాల నియోజకవర్గం పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) 16వ డివిజన్ ధర్మారంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ధర్మారంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపాలను వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పరకాల పీసీసీ సభ్యులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి పల్లకి సేవలో ఆయన స్వయంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.పూజా కార్యక్రమాల అనంతరం ఇనగాల వెంకట్రామ్ రెడ్డి కాలనీ ప్రజలను కలుసుకుని, వారందరికీ దేవి నవరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.