Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:07 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

దుర్గాభవాని మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ఎమ్మెల్యే…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16

గ్రేటర్ వరంగల్ నగరంలోని 56వ డివిజన్ గోపాలపురంలోని నవదుర్గ ఉత్సవ కమిటీ మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆర్చ్, మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని మహాన్నదాన కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే  శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. భక్తులతో ఆప్యాయంగా మెలుగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల నిర్వాహకులు, భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు,రాష్ట్ర లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, సీనియర్ నాయకులు చింత రమేష్, మర్రి ప్రభాకర్, ఐలన్న, కృష్ణమూర్తి, సంధ్య, విజయ్ సూర్య, శ్రీను, డివిజన్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.