దుర్గమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన నాయిని నీలిమారెడ్డి..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక 12అక్టోబర్ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 50వ డివిజన్ పరిధిలో స్థానిక నాయకుల ఆహ్వానం మేరకు రెవెన్యూ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమారెడ్డి  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బషీర్,మాజీ అధ్యక్షులు అఫ్సర్,ఉత్సవ కమిటీ సభ్యులు,స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు.