Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 5:56 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

దసరా ఉత్సవాల సందర్భంగా కలెక్టర్‌ను కలిసిన దసరా ఉత్సవ కమిటీ…

వరంగల్, అక్టోబర్ 4: పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక 

దసరా ఉత్సవాల సందర్భంగా రాంగలీలా మైదాన్‌ (ఉర్సు గుట్ట), ఖరీమాబాద్‌కు చెందిన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను కలెక్టర్‌కు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.అధ్యక్షుడు గోపాల్ నవీన్ రాజుకమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మెడిది మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న గౌడ్, సంయుక్త కోశాధికారి వెలిది శివమూర్తి, ఉత్సవ కన్వీనర్ వొడ్నాల నరేందర్, ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ తదితరులు కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.