తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్… –ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభినందనలు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 05 వరంగల్: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్ ఎన్నిక కావడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.తస్లీమా మొహమ్మద్ గతంలో కూడా ప్రజా సేవలో తనదైన ముద్ర వేసుకున్నారని, ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచారని వారు పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు అవసరమైన సమయంలో...