Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 4:08 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్… –ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అభినందనలు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 05

వరంగల్: తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా తస్లీమా మొహమ్మద్ ఎన్నిక కావడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పలువురు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.తస్లీమా మొహమ్మద్ గతంలో కూడా ప్రజా సేవలో తనదైన ముద్ర వేసుకున్నారని, ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, అవసరంలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలిచారని వారు పేర్కొన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలకు అవసరమైన సమయంలో మంచి చెడుల్లో తోడుగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు.అదేవిధంగా ఒక ట్రస్ట్‌ను నిర్వహిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు, అవసరమైన వారికి వివిధ రకాలుగా సహాయం అందించినట్లు పేర్కొన్నారు. అధికార బాధ్యతలతో పాటు సామాజిక సేవకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు.తెలంగాణ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తస్లీమా మొహమ్మద్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, శ్రేయోభిలాషులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆధ్వర్యంలో అసోసియేషన్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.