Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 1:33 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి… -అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి…. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5

అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ని సందర్శించి అక్కడ పిల్లలకు గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ , హైజినిక్ ఫుడ్ ఫై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ
పిల్లలకు చదువు తో పాటు మంచి నడవడిక అవసరం అని, గుట్కా,మత్తుపదార్థాల వంటి చెడు అలవాట్ల బారిన పడవద్దని
పిల్లలకు తల్లి దండ్రులు సమయం కేటాయించాలని, పిల్లలను గొప్పగా పెంచడం కాదని మంచి విలువలతో పెంచా లని అన్నారు, చిన్నతనం నుండి క్రమశిక్షణతో పెంచాలని అతి గారాబము చేయవద్దని అడిగిన వన్ని కొనివ్వడం చేయకూడదని ముఖ్యంగా సెల్ ఫోన్లకు పిల్లలు బానిసలుగా మారుతున్నారని దీని పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పాఠశాల, కళాశాలకు పంపడం అంటే విద్య కోసం మాత్రమే కాదని మంచి నడవడిక, క్రమశిక్షణ, మంచి విలువలు నేర్పించి దేశానికి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఉందని, చిన్నతనం నుండే గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ అంటే ఏంటి ఎలా గుర్తించాలి, అలాంటి సంఘటనలు ఎదురై అలాంటి వారి బారిన పడితే ఎలా తాము రక్షణ పొందాలి వంటి విషయాలను సూక్ష్మంగా ఉదాహరణ లతో పిల్లలకు వివరించి అవగాహన కల్పించారు, ప్రేమ పేరు తో మోస పోవద్దని, అపరిచితుల పట్ల పిల్లలు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియ చేశారు ఇవన్నీ కూడా మాట్లాడుకునే అంశాలని ముందు తల్లిదండ్రులు, పిల్లలు గుర్తించాలని తరచు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డాక్టర్ అనితా రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ అనితా రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ దీప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.