Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:08 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – ఎడిషన్ 2 | 10K రన్‌కు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, GWMC కమిషనర్…

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 

యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, ఫిట్‌నెస్‌, క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించే లక్ష్యంతో నాయిని విశాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, యువ నాయకులు శ్రీ విష్ణు రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – ఎడిషన్ 2 కార్యక్రమంలో భాగంగా హయగ్రీవాచారి మైదానంలో ఏర్పాటు చేసిన 10 కిలోమీటర్ల పరుగును ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి , GWMC కమిషనర్  వెంకన్న  జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, పట్టుదల, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు.