వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుళ్ల రవికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నియామక ఉత్తర్వుల ప్రతిని హన్మకొండ సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో తుళ్ల రవి విజయవంతంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆకాంక్షించారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ డిపార్ట్మెంట్ విస్తరణకు తుల్ల రవి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, అంకితభావంతో పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వారి వెంట మండల పార్టీ అధ్యక్షులు వెంకన్న గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, ఐనవోలు మాజీ చైర్మన్ ప్రభాకర్ గౌడ్, కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి యాదగిరి గౌడ్, ఐఎన్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు పోశాల మధుకర్ గౌడ్, ఐఎన్టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి దీకొండ ఉపేందర్,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపల్లి యాదగిరి,సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు దుబ్బ అంజన్న,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దామర ప్రశాంత్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెపాక సమ్మయ్య ,నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.