Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 4:04 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–చేనేత క్లాస్టర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1  వరంగల్, అక్టోబర్ 1:

జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం జిల్లాలోని కొత్తవాడ లోని మట్టేవాడ,దయానంద్ చేనేత క్లస్టర్లను సందర్శించి, అక్కడి ఉత్పత్తుల తయారీ విధానంను పరిశీలించారు.చేనేత కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులతో చర్చించారు. స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతో పాటు, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికల ద్వారా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వరంగల్ ఎక్స్‌పోర్ట్ హబ్‌ను వినియోగించుకుని జిల్లాలో తయారయ్యే చేనేత, ఇతర స్థానిక ఉత్పత్తులకు ఎగుమతి అవకాశాలను పెంపొందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.వరంగల్‌లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని అనుసంధానం చేసుకుని స్థానిక ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలన్నారు.చేనేత కార్మికులు, ఉత్పత్తిదారుల సంఘాలకు అవసరమైన సాంకేతిక శిక్షణ, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో సహకారం అందించి, వరంగల్ చేనేత ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ పరిశీలనలో జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారినరసింహ మూర్తి, మరియు రాష్ట్ర చేనేత వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు,తదితర చేనేత కార్మికులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.