-గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు: పర్యటించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి …

హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ వేడుకల్లో ఆయన పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఆత్మకూరు గ్రామానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమలగిరి గ్రామ సంబరాలకు హాజరయ్యారు. చివరగా *హౌస్ బుజుర్గు గ్రామానికి వెళ్లి, అక్కడ మహిళలు...