Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 7:29 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

-గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు: పర్యటించిన డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి …

హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి జిల్లాలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ వేడుకల్లో ఆయన పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత ఆత్మకూరు గ్రామానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం తిరుమలగిరి గ్రామ సంబరాలకు హాజరయ్యారు. చివరగా *హౌస్ బుజుర్గు గ్రామానికి వెళ్లి, అక్కడ మహిళలు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ ఆటపాటలను తిలకించారు. ఆయా గ్రామాల్లో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి  కి స్థానిక సర్పంచులు, మండల అధ్యక్షులు, నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ఒక నిదర్శనమని, ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.ఈ పర్యటనలో డీసీసీ అధ్యక్షుడి వెంట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.