Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:31 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04 

ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం హనుమకొండ లోకల్ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా TWU, SWF, INTUC ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఆర్టీసీ కార్మికులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అనేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్టీసీని బలోపేతం చేయడంతో పాటు సంస్థలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల ఐక్యత, సంక్షేమం కోసం పనిచేస్తున్న TWU, SWF, INTUC ఐక్య కూటమికి ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో వరంగల్ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.