Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:42 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు పేదింటి ఆడపడుచుల పాలిట వరం… __మాజీ మంత్రి వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ 08  వరంగల్ 21వ డివిజన్ లోని A1 ఫంక్షన్ హాల్ లో గురువారం 264 మంది లబ్ధిదారులకు 2కోట్ల 64 లక్షల 30,000 వేల 624రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను మాజీ మంత్రి కొండా సురేఖ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లిలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.అందరికీ సమాన న్యాయం చేయడం, నిరుపేదల కుటుంబాలు వెలుగులు నింపడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ముందుకు పోతున్నదని కొండా సురేఖ  చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమం అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూన్నదని అన్నారు . ప్రతి ఇంటికి ఇల్లాలే వెలుగని, మహిళ లక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ. 10 లక్షలకు ఆరోగ్య శ్రీ పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పేదల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందుతున్నాయన్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేస్తున్నామని తెలిపారు దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పథకం అమలు చేస్తున్నామని మాజీ మంత్రి తెలిపారు. అర్హులైన వారికి నూతన రేషన్ కార్డులు అందజేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులు అధైర్యపడవలసిన అవసరం లేదని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు.