Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 2:59 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

కడియం కావ్య సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు…..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 

స్టేషన్ ఘనపూర్ మండలం అక్కపల్లి గూడెం నుండి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు యార కొమురిల్లి  ఆధ్వర్యంలో సుమారు 20మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సమక్షంలో కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం హన్మకొండ కనకదుర్గ కాలనిలోని నివాసంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య  మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని వర్గాల ప్రజలు ఆకర్షతులు అవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని అనడానికి కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న చేరికలే నిదర్శనమని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు మనందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొమ్మగాళ్ల పెత్రు, యార్ల మైపాల్, చిన్నోజు జీవన్, కూసరాజు, అనుముల అనిల్, అనుముల అశోక్, బొమ్మగాళ్ల అఖిల్, బొమ్మగాళ్ల సురేష్, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.