పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26
–ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి—
ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఓట్ బచావో – దేశ్ బచావో” ఫేజ్–3 ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం హనుమకొండ డీసీసీ భవన్‌లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు, టీపీసీసీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని ప్రచార కార్యక్రమం అమలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం, ఓటర్లలో అవగాహన పెంపొందించడం, పార్టీ శ్రేణులను కార్యక్రమంలో భాగస్వాములను చేయడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏఐసీసీ సూచనల మేరకు “ఓట్ బచావో – దేశ్ బచావో” ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నవంబర్ 1వ తేదీన రాంలీలా మైదానంలో నిర్వహించనున్న “ఛలో ఢిల్లీ” కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని, తెలంగాణ గళాన్ని దేశ రాజధానిలో వినిపించాలన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ లక్ష్యంగా చేపడుతున్న “ఓట్ బచావో – దేశ్ బచావో” ఉద్యమంలో ప్రతి నాయకుడు, కార్యకర్త భాగస్వామి కావాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, చైర్మన్లు,డివిజన్ అధ్యక్షులు,మండల అధ్యక్షులు,సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.