–ఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది.. —దేశప్రజల గొంతుక రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు… —డీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని..
హనుమకొండ జిల్లా.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును కూడా హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనపై ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చర్యలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో...