Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 5:04 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

ఐనవోలు మండల ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ పండుగ ప్రతీక… కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్…

ఐనవోలు, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9  ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్భంగా ఐనవోలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్ మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు.. ముఖ్యంగా ఆడపడుచులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకరకంటి మోహన్ గౌడ్  మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికిప్రతీక అని అన్నారు.బతుకమ్మ వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెబుతాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పండుగల విశిష్టతను భావితరాలకు అందిస్తూ మన సంస్కృతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు కలగాలని నకరకంటి మోహన్ గౌడ్ ఆకాంక్షించారు.