–ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు… –ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పదోన్నతులు, ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష…
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9..హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణం కమిటీ హాల్లో శుక్రవారం శాసన మండలి షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ డాక్టర్ మేడిపల్లి సత్యం అధ్యక్షతన నిర్వహించిన కమిటీ సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యక్ష నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ పథకాలు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయిస్తున్న...