ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు  ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు …

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ  భర్త, సీనియర్ రాజకీయ నాయకులు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు ఇటీవల అనారోగ్యంతో హాస్పటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్న ఆయనను వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వరద రాజేశ్వర్ రావు  ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాగరాజు , త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు....