ఎమ్మెల్యే కనకయ్య మాస్ ఎంట్రీ.. ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తలకు అదిరిపోయే సర్ప్రైజ్!
ఇల్లందు/చల్లసముద్రం:చల్లసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని బతుకమ్మ ఘాట్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆప్యాయంగా పలకరించారు.బతుకమ్మ ఘాట్ వద్ద స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు కడుతుండగా, అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి వారి వద్దకు వచ్చారు. కార్యకర్తలను చూసి చిరునవ్వుతో పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తమ వద్దకు...