ఎట్టకేలకు శ్రీదేవికి న్యాయం….. — వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు  చొరవతో ప్రేమజంటకు పెళ్లి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 ప్రియుడు శ్రీకాంత్‌తో వివాహం జరిపించాలని కోరుతూ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న దళిత యువతి శ్రీదేవి ఆందోళనకు ఎట్టకేలకు ముగింపు లభించింది. వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కే.ఆర్. నాగరాజు  ప్రత్యేక చొరవతో శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించారు.ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు  ఆధ్వర్యంలో ఇరువర్గాల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు కృషి చేశారు. ఎమ్మెల్యే  చొరవతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకారం తెలపడంతో...